NTV Telugu Site icon

దేశ ప్రజలకు ‘ట్రిపుల్ ఆర్’ బృందం విజ్ఞప్తి…!

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సమయాన్ని కరోనా బాధితులకు సహాయం చేయడానికి కేటాయించారు దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి కావలసిన అవసరాలను తీర్చడంతో పాటు వారు ఎక్కడ నుండి తమకు కావాల్సిన వాటిని తీసుకోవచ్చు అనేదాన్ని తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా తెలియచేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఇవాళ పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాజమౌళి తన హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గన్; హీరోయిన్ అలియా భట్ లతో ఓ చక్కని సందేశాన్ని సమాజానికి అందించారు. అన్ని సమయాల్లోనూ మాస్క్ ను ధరించమని, వేక్సినేషన్ ఎప్పుడు లభిస్తే అప్పుడు దానిని వేసుకోమని, సామాజిక దూరం పాటించమని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో వీరితో చెప్పించారు. అంతే కాదు తానూ స్వయంగా ఈ సందేశాన్ని జనాలకు అందించారు. భారత దేశంలో కరోనా వ్యాపించకుండా ఉండటానికి అందరం కలిసి కట్టుగా ఉందనమని రాజమౌళి బృందం చెబుతోంది. రాజమౌళి, ఎన్టీయార్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గన్ వివిధ భాషాల్లో తమ సందేశాన్ని వినిపించగా, అలియా భట్ తెలుగులో చెప్పడం విశేషం. మరి ఈ స్టార్స్ అభిమానులంతా దీనిని పాటించాలని కోరుకుందాం.