Site icon NTV Telugu

కరోనాతో మెగా హీరో వ్యానిటీ డ్రైవర్ మృతి… ఐసోలేషన్ లో చరణ్…!

Ram Charan self isolates after his Vanity Driver dies due to Covid

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. టాలీవుడ్ స్టార్స్ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం. ఇటీవలే చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు కరోనా సోకగా… ఈరోజు ఆయన కరోనాతో మృతి చెందాడు. చరణ్ సిబ్బందిలో ఒకరు కరోనాతో ఆకస్మికంగా చనిపోవడం విషాదకరం. ప్రస్తుతం చరణ్ కూడా ముందుజాగ్రత్తగా ఐసోలేషన్ లోకి వెళ్లారట. త్వరలోనే చరణ్ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్నారు. కాగా గతంలో ఒకసారి చరణ్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కరోనా సోకడంతో … ఆయన కూడా ఇప్పుడు ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మంచిది.

Exit mobile version