NTV Telugu Site icon

లంకకు వెళ్లే టీంఇండియాకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్…?

జూన్‌ 18-22 మధ్య జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఆ తర్వాత  అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది. కానీ ఈ మధయ్లో జులైలో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతేడాది కరోనా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది. అయితే టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కు వెళ్లిన ఆటగాళ్లతో కాకుండా మిగిలిన సీనియర్ ఆటగాళ్లతో ఓ జట్టును చేసి శ్రీలంకకు పంపనుంది బీసీసీఐ. దాంతో లంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు అని తెలుస్తుంది. లంక టూర్‌కి కోచ్‌గా వ్యవహరించమని బీసీసీఐ ద్రవిడ్‌ని కోరినట్లు… అయితే దానికి ద్రవిడ్‌తో పాటు ఎన్‌సీఏలోని సపోర్ట్ స్టాఫ్‌ కూడా అంగీకరించినట్లు సమాచారం. చూడాలి మరి దీని పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది.