NTV Telugu Site icon

Tamilisai: గవర్నర్‌ ఆర్టికల్స్.. నెటిజ‌న్లు ఫిదా..

???????? ?????? ?????????????

???????? ?????? ?????????????

రాజ్ భవన్ పాఠశాల మ్యాగజైన్‌ను గవర్నర్ తమిళి సై ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు రూపొందించిన సాహిత్య, కళాకృతుల సంకలనాన్ని ఆలకించారు. మ్యాగజైన్ లో రాజ్ భవన్ పాఠశాల 2017 నుండి 2022 వరకు సాధించిన విజయాల ప్రస్తావన వుంటుందని గవర్నర్ తమిళి సై తెలిపారు.

పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి మ్యాగజైన్స్ ఉపయోగపడుతాయని అన్నారు. నేను కూడా చాలా ఆర్టికల్స్ రాశానని పేర్కొన్నారు. రోటీన్ గా చదవడం, రాయడమే కాకుండా స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాల గురించి ఆర్టికల్స్ చదవాలి, రాయాలి, పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఇప్పటికే 100 మంది పిల్లలకు ట్యాబ్స్ అందించామన్నారు.

మీరు మునుపటి గవర్నర్‌లా కాదు నెటిజ‌న్లు ఫిదా..

ప్రజలు, భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బయట ఆలయాల సందర్శనకు తమిళిసై స్వస్తి చెప్పారు. రాజ్ భవన్‌లోని అమ్మ వారి ఆలయంలోనే రోజూ పూజలు చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు మునపటి గవర్నర్‌లా కాదు మేడం..’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

దీనికి కారణమేంటంటే.. ప్రతిరోజూ ఆలయ సందర్శనలను ఇష్టపడే తమిళిసై.. బయట గుడిలో దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడి భక్తులు, రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు పడుతున్న అసౌకర్యాన్ని చూసి ఆమె మనసు మార్చుకున్నారు.

ఈ క్రమంలోనే రాజ్ భవన్‌లోని అమ్మ వారి గుడిలోనే గవర్నర్ పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. భక్తులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గవర్నర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి.

‘ప్రియమైన గవర్నర్ గారు, రాష్ట్ర ఖజానాకు విపరీతమైన ఖర్చుతో పాటు ప్రజలకు, భక్తులకు అసౌకర్యాన్ని కలిగించే పాత వారి మాదిరిగా కాకుండా మీ ఆలయ సందర్శనలను పరిమితం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’ అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

‘గొప్పతనమంటే అది.. దీన్ని కేసీఆర్, కేటీఆర్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో..?’ అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఇక ఓ నెటిజన్ అయితే గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు రోజుల్ని తలచుకొని తెగ బాధపడ్డాడు.

Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!