NTV Telugu Site icon

వికారాబాద్ అడవుల్లో బాలయ్య… ‘అఖండ’ కోసమే…!

Akhanda

Akhanda

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’. ఉగాది కానుకగా విడుదలైన ‘అఖండ’ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ‘అఖండ’ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ ను అధిగమించింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా ‘అఖండ’ టీం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు బోయపతి శ్రీను వికారాబాద్ అటవీప్రాంతంలో బాలకృష్ణ, శ్రీకాంత్ లపై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇంతకుముందు ‘లెజెండ్’ చిత్రంతో జగపతి బాబును పవర్ ఫుల్ విలన్‌గా పరిచయం చేసిన బోయపాటి ‘అఖండ’తో శ్రీకాంత్ ను విలన్ గా పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రంలో పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. తమన్ బాణీలు కడుతున్నారు.