NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : ముంబై టార్గెట్ ఎంతంటే…?

ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (41), యషస్వి జైస్వాల్ (32) తో రాణించారు. కానీ ముంబై బౌలర్ రాహుల్ చాహర్ ఇద్దరు ఓపెనర్లను వెన్నకి పంపాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ సంజు సామ్సన్ (42), శివం దుబే (35) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. కానీ చివర్లో వారిద్దరూ కూడా పేవుకుయం కు చేరడంతో నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది రాయల్స్. ఇక రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై 172 పరుగులు చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.