సూపర్ స్టార్… ఆర్గానిక్ ఫార్మింగ్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాక్ డౌన్ పుణ్యామా అని గత యేడాది చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిపోయారు. క్షణం తీరిక లేకుండా గడపడం అలవాటైన కొందరు సెలబ్రిటీస్ లాక్ డౌన్ టైమ్ ను కూడా బాగానే ఉపయోగించుకున్నారు. చాలామందిలానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టారు. ఎర్నాకుళం లోని తన ఇంటి పక్కనే ఉన్న విశాలమైన స్థలంలో వంకాయ, దోసకాయ, కాకరకాయ, సొరకాయ వంటి కూరగాయలను పండించాడు. ఇవాళ ఆరోగ్య పరంగానూ చాలామంది సేంద్రియ ఎరువులతో పెరిగిన కాయగూరలనే ఎక్కువ వాడుతున్నారు. దాంతో వాటి డిమాండ్ బాగా పెరిగిపోయింది. కొంతమంది దీనిని వ్యాపారంగా మార్చుకుంటే, మరి కొందరు తమ ఇంటికి అవసరమైన కూరగాయలను పండించడం ఓ వ్యాపరంగా పెట్టుకున్నారు. మొక్కలు పెంచడానికి స్థలం లేనివారు ‘మిద్ది సేద్యం’ చేస్తున్నారు. మోహన్ లాల్ మాత్రం సేంద్రియ వ్యవసాయం విషయంలో తన తోటి నటీనటులు, అభిమానులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా నెట్ వర్క్ లో పోస్ట్ చేశారు. మోహన్ లాల్ లాంటి వ్యక్తి మంచి మాటలు చెబితే దానిని ఆచరించేవారు లక్షల్లో ఉంటడం ఖాయం. మరి ఈ సేంద్రియ వ్యవసాయంతో ఎంతమంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారో చూడాలి.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!