Site icon NTV Telugu

ఆక్సిజన్ కొరతపై రేపు మంత్రి మేకపాటి ఉన్నత స్థాయి సమీక్ష…

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రలోనే కాదు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా పేషేంట్లకు ట్రీట్మెంట్ అందించే సమయంలో ఆక్సిజన్ చాలా ముఖ్యం కావడంతో దాని కొరత ఏర్పడుతుంది. ఇక ఏపీలో  ఆక్సిజన్ కొరతపై రేపు మంత్రి మేకపాటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఆక్సిజన్ ఉత్పత్తికి అవసరమైన చర్యలపై పరిశ్రమల శాఖ ఫోకస్ పెట్టింది. అలాగే ఎయిర్ సపరేటర్ల కొనుగోళ్లకు మార్గ దర్శకాల జారీ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Exit mobile version