నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడంతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగాన్ని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని… కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఇంచార్జి DMHO డాక్టర్ స్వర్ణలతకు ఆదేశాలు జారీ చేసారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ… నెల్లూరు జిల్లాలో 12 కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. నెల్లూరు గవర్నమెంట్ ఆస్పత్రులలో ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్న 561మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా బాధితులకు అవసరమైన మందులు,ఆహారం అందించాలి. నెల్లూరు జిల్లాలో అన్ని కోవిడ్ ఆస్పత్రులలో వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు.