పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొండుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమాను ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ పై అనేక అనుమానాలు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి 25 న నాలుగు సినిమాలు ఢీకొట్టనున్నాయి. భీమ్లా నాయక్ ఏప్రిల్ 1 న ఫిక్స్ చేసుకోవడం వలనే మిగిలిన నాలుగు సినిమాలు ఫిబ్రవరి 25 ని ఎంచుకున్నాయి. దానికి తగ్గట్టే ప్రమోషన్లు కూడా జరుపుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో సడెన్ గా ఫిబ్రవరి 25 భీమ్లా నాయక్ వస్తుంది అని మేకర్స్ ప్రకటించడం వెనుక మతలబు ఏంటి అనేది ఆలోచించదగ్గ విషయం. అయితే దీని వెనుక ఉన్న కారణాల్లో ఆర్ఆర్ఆర్ కూడా ఉందని తెలుస్తోంది. మార్చి 25 న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది.
వారం గ్యాపులో ఏప్రిల్ 1 భీమ్లా నాయక్ రిలీజ్ చేస్తే థియేటర్లు దొరకడం కష్టం.. అంతేకాకుండా వంద కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కోసం వరుసగా రెండు వారాల పాటు అన్ని ఏరియాలలో థియేటర్లను బ్లాక్ చేస్తారు.అది భీమ్లా నాయక్ బిజినెస్ ని దెబ్బ తీస్తుంది. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే మేకర్స్ ఫిబ్రవరి 25 న సినిమా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీలో ఆక్యుపెన్సీ మరియు టిక్కెట్ ధరలు పెంపు అంశాలతో సంబంధం లేకుండా ఫిబ్రవరి 25వ తేదీని ఖరారు చేయడానికి ఇదే కారణమని టాక్ నడుస్తోంది. అందుకే ఈ డేట్ ని లాక్ చేసి మేకర్స్ నిజంగానే రిస్క్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇన్ని సమస్యల మధ్య పవన్ సినిమా రిలీజై ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.