కేంద్ర గ్రీన్ ఎనర్జీ వైపు దృష్టి సారిస్తోంది. దీని కోసం దశల వారీగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించే ప్లాన్ లో ఉంది. నాలుగేళ్లలో కనీసం 81 బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని లక్ష్యం పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు యూటీలకు లేఖ రాసింది. థర్మల్ విద్యుత్ స్థానంలో సోలార్, విండ్ పవర్ ను ప్రోత్సహించనుంది. దీని ద్వారా బొగ్గు దిగుమతిని నిలిపివేయడంతో పాటు విదేశీ మారక నిల్వల ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఖరీదైన థర్మల్ విద్యుత్ స్థానంలో చవకైన గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తోంది కేంద్రం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 173 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో చవకైన గ్రీన్ ఎనర్జీ లభించే సమయానికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాంకేతికత కనిష్ట స్థాయికి చేరుకునేలా కేంద్రం ప్రణాళికలు వేస్తోంది. ఇదిలా ఉంటే ఎప్రిల్ నెలలో దేశంలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో బొగ్గుపై విపరీతమైన ప్రభావం పడింది. బొగ్గు దిగుమతులను కనిష్ట స్థాయికి తీసుకురావాలనుకున్న కేంద్రం మళ్లీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే సౌర విద్యుత్ అందుబాటులో లేని రాత్రి సమయాల్లో గరిష్ట వినియోగం పెరుగుతోంది. దీంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిలిపివేయడం పెద్ద సవాల్ గా మారిది. దీనికి తోడు అణు విద్యుత్, జల విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ వనరుల నుంచి వచ్చే విద్యుత్ కూడా తక్కువగానే ఉంటోంది. భారత దేశం ప్రపంచంలోనే బొగ్గు దిగుమతిదారు, ఉత్పత్తి దారు, వినియోగదారుగా ఉంది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కరెంట్ లో 75 శాతం వాటా థర్మల్ విద్యుత్ కేంద్రాలదే.
భారతదేశంలో 175 గిగావాట్ల పునరుత్పాదక ఎనర్జీని స్థాపించగలిగితే భారత్ అనుకున్న లక్ష్యం సాధించే అవకాశం ఉండటంతో పాటు విద్యుత్ సంక్షోభాన్ని నివారించే అవకాశం ఉందని థింక్ ట్యాంక్ క్లైమేట్ రిస్క్ హారిజన్స్ మే నెలలో ఓ నివేదికలో పేర్కొంది.
పునరుత్పాదక ఇంధనంలో 175 గిగావాట్లను వ్యవస్థాపించాలనే లక్ష్యం ఉన్నట్లయితే భారతదేశం యొక్క ప్రస్తుత విద్యుత్ సంక్షోభాన్ని నివారించవచ్చని థింక్ ట్యాంక్ క్లైమేట్ రిస్క్ హారిజన్స్ మేలో ఒక నివేదికలో పేర్కొంది. సౌర, పవన విద్యుత్ పెంచగలిగితే.. రాత్రి సమాయాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు పని చేయడానికి బొగ్గు నిల్వలను కాపాడుకోవచ్చని తెలిపింది. దీనితో 34.7 మిలియన్ టన్నుల బొగ్గును ఆదా చేయడంతో పాటు 60.2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంటుంది.