NTV Telugu Site icon

హీరో నిఖిల్‌ కారుకు చలానా విధించిన పోలీసులు

సినీహీరో నిఖిల్‌కు చెందిన రేంజ్ రోవర్ కారుకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా కారు కనిపించింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా.. సినీ నటుడు నిఖిల్‌కు చెందిన కారు అని పోలీసులకు తెలిపారు. అయితే, నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు.