Site icon NTV Telugu

‘వీరమల్లు’ వీడియో లీక్.. ఫ్యాన్స్ సీరియస్!

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా, క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్‌ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా మొదలైనప్పటి నుంచే షూటింగ్ లొకేషన్స్ లోని సన్నివేశాలు బయటకి వస్తుండటంతో చిత్రయూనిట్ జాగ్రత్తపడింది. అయిన కూడా లీకేజీలు కొనసాగుతూనే వున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఎవరో ఆకతాయి ఈ వీడియోను షేర్ చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీడియో డిలీట్ చేయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం తెగ పండుగ చేసుకుంటున్నారు. కాగా ఈ వీడియోలో ఉన్నది మల్లయోధులతో పవన్ చేసే పోరాటంగా తెలుస్తోంది.

Exit mobile version