NTV Telugu Site icon

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా జీహెచ్‌ఎంసీ ఆఫీస్…

హబ్సిగూడ జీహెచ్‌ఎంసీ వార్డ్ ఆఫీస్ ను తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి. గతంలో ఎమ్మెల్యే భార్య బేతి స్వప్న హబ్సిగూడ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు అక్కడే కలిసి పనిచేసారు ఎమ్మెల్యే, కార్పోరేటర్. కానీ ప్రస్తుతం హబ్సిగూడ కార్పొరేటర్ గా బీజేపీ అభ్యర్థి చేతన ఉన్నారు. దాంతో ఉప్పల్ జీహెచ్‌ఎంసీ అధికారులు వార్డ్ ఆఫీస్ మాకు ఇవ్వాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. దాంతో చెట్టు కింద విధులు నిర్వహిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్. కాగా ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరో ప్రాంతంలో ఉందంటున్నారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది.