‘వలయం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’. యంగ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య తో ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, ”డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అలానే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ టైటిల్ వీడియో సాంగ్ కూడా యూట్యూబ్లో దూసుకుపోతోంది.
ఇక ఇటీవల జరిగిన షెడ్యూల్ తో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగు తున్నాయి. సినిమాకి సాయి కార్తీక్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.