రాష్ట్రంలో కరోన ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ హాస్పిటల్ లో వేంటిలేషన్ ఖాళీ లేవు. తాను ఉదయం నుండి ఒక్క బెడ్ కోసం ట్ర్య్ చేస్తే దొరకలేదు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. నేరుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ , ప్రయత్నం చేసినా కరోనా పేషంట్ కు బెడ్ దొరకాకపోవడం బాధనిపిస్తుంది అని చెప్పిన ఆయన ఎందుకు ప్రభుత్వం ప్రజలకు అసత్యాలు చేతున్నారు. ఏమయ్యాయి..వెంటిలాషన్లు… నిజాలు దాచిపెట్టి ప్రభుత్వం ఎవర్ని మభ్యపెడుతున్నారు అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆట ఆడుతుంది. కెవలం కామారెడ్డి లో ఐదు మంది కరోనాతో ఈ రోజు చనిపోయారు. ఇంకా అన్ని జిల్లాలో మొత్తం కరోనాతో ఎంత మంది చనిపోతున్నారో ప్రభుత్వం చెప్పాలి.
రాష్ట్రంలో కరోనాతో ప్రజలు చనిపోతుంటే…ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ ప్రభుత్వంనికి బుద్దిలేదు. కేసీఆర్ పిల్లలకు పరీక్షలు రద్దు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వైన్స్ లు , పబ్బులు , తెరిచి విద్యాసంస్థలు బంద్ చేస్తున్నారా…?. రాష్ట్రంలో పరిస్థితి అద్వనంగా ఉంది. వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.కేసీఆర్ ఎన్నికలను రద్దు చేయకుంటే ముఖ్యమంత్రి ని రాళ్లతో కొడుతారో ఎం చేస్తారో ప్రజలు తీల్చుకోవాలి. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు పిట్టల రాలిపోతున్న సీఎం కేసీఆర్ కు బుద్దిరావడం లేదు. సీఎం కరోన పరిస్థితి పై రివ్యూ చేయకుండా మద్యం ఆదాయం పై రివ్యూలు చేస్తున్నారు అని అన్నారు.