చిత్రపరిశ్రమలో మీటూ ఉద్యమం ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో అందరికి తెలుసు. హీరోయిన్లపై హీరోలు, దర్శకనిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఈ ఉద్యమం మొదలయ్యింది. ఈ మీటూ ఉద్యమంలో ఎంతమంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న వేధింపులు బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఈ ఉద్యమం నడిచేటప్పుడే కోలీవుడ్ హీరోయిన్ శృతి హరిహరన్, స్టార్ హీరో అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించింది.
షూటింగ్ సమయంలో తనను అసభ్యంగా తాకుతూ, కౌగిలించుకోవడానికి ట్రై చేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు అర్జున్ ని విచారించారు. మూడేళ్ళ విచారణ తరువాత ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవని తెలుపుతూ పోలీసులు తాజాగా అర్జున్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. అర్జున్ పై హీరోయిన్ తెలిపినవాణ్ణి అభియోగాలు అని తెలుపుతూ నివేదికను సమర్పించింది. దీంతో అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని అర్జున్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.