NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : రాణించిన పంజాబ్ ఓపెనర్లు

ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఢిల్లీ ముందు మంచి లక్ష్యానే ఉంచింది. ఆ జట్టు ఓపెనర్లు మయాంక్(69), రాహుల్(61) అర్ధశతకాలతో రాణించి మొదటి వికెట్ కు 122 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. అయితే వారు పెవిలియన్ కు చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్ అంతగా రాణించకపోయిన దీపక్ హుడా 13 బంతుల్లో 22 పరుగులు ఆలాగే షారుఖ్ ఖాన్ 5 బంతుల్లో 15 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. ఇక ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, కగిసో రబాడా, అవెష్ ఖాన్, లుక్మాన్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఢిల్లీ 196 పరుగులు చేయాలి. కానీ ఈ రెండు జట్లలో ఢిల్లీ పైన పంజాబ్ కే మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.