NTV Telugu Site icon

కర్ఫ్యూ కారణంగా విశాఖలో బోసిపోయిన బీచ్ రోడ్డు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు 20 వేలకు పాగా కేసులు వస్తున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అయితే ఏపీలోని అన్ని జిల్లాల కంటే విశాఖలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కర్ఫ్యూ కారణంగా విశాఖలో బీచ్ రోడ్డు బోసిపోయింది. కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూ తో విశాఖలో వీకెండ్ జోష్ కనిపించలేదు. కరోనా భయంతో విశాఖ వాసులు కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యారు. అక్కడ యువత కూడా ఈ కరోనా కాలంలో బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. కరోనా వ్యాప్తి యువతలోనూ తీవ్రంగా ఉండడంతో బయటకొచ్చేందుకు జంకుతోన్నారు యువత. కరోనా విరుంబాణ కారణంగా కర్ఫ్యూకు సహకరిస్తున్నారు విశాఖ వాసులు.