NTV Telugu Site icon

కడపలో పెరుగుతున్న కరోనా కేసులు…

కడప జిల్లాలో రోజురోజుకు విపరీతంగా పెరిగి పోతున్నాయి కరోనా పాజిటివ్ కేసులు. నేడు జిల్లా వ్యాప్తంగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 60379 కరోనా పాజిటివ్ కేసులు  నమోదు కాగా కరోనా బారిన పడి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 57935 గా ఉంది. అలాగే ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 552 గా నమోదుకాగా  కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి సంఖ్య 1436. అయితే కడప జిల్లాలో మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రంలో కేసులు భారీగా నమోదవుతుండటంతో అక్కడ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.