Site icon NTV Telugu

రాష్ట్ర ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్…

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావం చేత సామూహికంగా జరుపుకోలేక పోతున్నామన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో దేవాలయ పూజారులు అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాములవారి కల్యాణ మహోత్సవాన్ని ఆన్లైన్ ప్రసారాల ద్వారా సీతారామభక్తులందరూ దర్శించుకోవాలని సిఎం కోరారు. లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలకోర్చిన సీతారాముల  పవిత్ర బంధం అజరామరమైనదని,రాబోయే తరాలకు  ఆదర్శనీయమైనదని సిఎం తెలిపారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని,  ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని  సీతారామచంద్రమూర్తులను సిఎం కేసీఆర్ ప్రార్ధించారు.

Exit mobile version