NTV Telugu Site icon

సీఐ కేశ‌వ్ నాయుడుగా ధ‌న్‌రాజ్‌! పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన సందీప్ కిష‌న్‌

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌.. అనేది మూవీ ట్యాగ్‌లైన్‌. దీనిని బట్టే సినిమా జానర్ ఏమిటనేది అర్థ‌మ‌వుతుంది. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్ కొద్ది రోజుల క్రితం విడుదలై, మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. తాజాగా ఈ సినిమాలో సీఐ కేశ‌వ్ నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్న ధ‌న్‌రాజ్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను ప్ర‌ముఖ హీరో సందీప్ కిష‌న్‌ విడుద‌ల చేశారు. ‘గ‌రుడ‌వేగ’ అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. సినిమాకు ఆయ‌నే సినిమాటోగ్రాఫ‌ర్‌గానూ వ‌ర్క్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి. నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, భాను, నందు మాటలు రాశారు.