తెలంగాణ, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ నీరుగార్చారు అని బండి సంజయ్ అన్నారు. పేదల ఆత్మ బలి దానాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కరసేవకుల బలిదానాలతోనే అయోధ్యలో రామమందిరం వచ్చింది అన్నారు. కేసీఆర్ మూర్ఖపు విధానాలతో రైతులు చెరుకు సాగు మానేశారు అన్న ఆయన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాలి అన్నారు. వరిసాగు పై రైతులకు భరోసా కల్పించాలి. అలాగే మొక్క జొన్నలు కొనకపోతే కేసీఆర్ ఫామ్ హౌజ్ ను ముట్టడిస్తా అని తెలిపారు. సీఎం మెడలు వంచి మొక్కజొన్న లను కొనిపిస్తాం అని చెప్పారు. ఇక ప్రజా సంగ్రామ యాత్ర దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్ ఛాలెంజ్ లను లేవనెత్తారు అని చెప్పిన ఆయన సవాల్లన్ని కాంగ్రెస్ టీఆర్ఎస్ ల డ్రామా లే అన్నారు. ఎంఐఎం గుండాల అరాచకాలు పెరిగిపోయాయి అని పేర్కొన్నారు.