నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఉండబోతోంది అనే వార్త చాలా రోజులుగా విన్పిస్తోంది.అయితే ఈ రూమర్లపై అటు బాలయ్య గానీ, ఇటు అనిల్ రావిపూడి గానీ స్పందించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంతకుముందు వచ్చిన రూమర్లే నిజం కాబోతున్నాయట. త్వరలోనే బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోందట. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత మహేష్ బాబుతో మరో సినిమాను రూపొందించాలనుకున్నాడు అనిల్ రావిపూడి. మహేష్ బాబు కూడా అనిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అంతకన్నా ముందు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కాల్సి ఉంది. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్న మహేష్.. .త్రివిక్రమ్ సినిమా పూర్తి చేయడానికి చాలా టైం పడుతుంది. దీంతో అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ ను బాలయ్యతో సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అనిల ఇటీవలే బాలయ్యను కలిసి తాను రాసుకున్న స్ట్రాంగ్ మాస్ స్టోరీని విన్పించాడట. ఆ స్క్రిప్ట్ నచ్చడంతో బాలయ్య కూడా అనిల్ రావిపూడికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మించనుంది. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాలి సంపత్’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మించింది. ‘టక్ జగదీష్’ కూడా షైన్ స్క్రీన్స్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో నిర్మితమవుతోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య…!
