NTV Telugu Site icon

స్మార్ట్‌గా డబ్బులు మాయం.. ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

బీహార్ కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎంల వద్ద సహాయం చేస్తున్నట్టు నటించి భాదితుల వద్ద ఏటీఎం పిన్ నెంబర్లను ఈ ముఠా సేకరిస్తుంది. పిన్ నెంబర్ సహాయంతో ‘స్మార్ట్ మ్యాగ్నేట్’ మిషన్ ద్వారా అకౌంట్ లోని డబ్బులు మాయం చేస్తున్నారు జాదూగాళ్ళు. ఈ తరహాలో నల్గొండ జిల్లాలో 15 నేరాలకు పాల్పడినట్లు ముఠా సభ్యులు తెలిపారు. నిందితుల నుంచి రూ 5 లక్షల నగదు, ల్యాప్ ట్యాప్, ఏటీఎం కార్డులు, మ్యాగ్నెట్ మిషిన్, ఇతర సామగ్రి స్వాధీనం చేశారు.