NTV Telugu Site icon

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

ఉత్తర-దక్షిణ ద్రోణి, బీహార్ తూర్పు ప్రాంతాల నుంచి, జార్ఖండ్, ఇంటీరియర్ ఒరిస్సా, విదర్భ, తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు  వరకు వ్యాపించి, సముద్ర మట్టం నకు ౦.9  కి. మీ. ఎత్తు వద్ద ఉన్నది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పరిస రా ల మీద , సముద్ర మట్టానికి  1.5km & 2.1km  ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఉన్నది. 

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈరోజు మరియు,రేపు   ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 km వేగం తో) వీచే అవకాశం ఉంది. 

దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపుప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి,  ఒకటి లేదా రెండు చోట్లతేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

రాయలసీమ:

ఈ రోజు,  రేపు మరియు ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్లతేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.