టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ట్వీట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి గజేంద్రుడిలా పని చేసుకుపోతున్నారు. జగన్ వెనుక కొన్ని కుక్కలు మొరుగుతాయ్ అవన్నీ పట్టించుకోనవసరం లేదు. మేం ట్వీట్ లు పెట్టడం మొదలు పెడితే స్పేస్ కూడా సరిపోదు. సభాపతిగా నాకు కొన్ని పరిమితులున్నాయ్. కానీ అచ్చెన్నాయుడి ట్వీట్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అవుతోంది అని అన్నారు. 17తర్వాత టీడీపీ లేదు డాష్ లేదు అని ఆయన అన్నదే కదా… తిరుపతి ప్రచారంలో రాయితో కొట్టారంటున్నారు. ఆ రాయి ఎక్కడినుంచి వచ్చిందో ఆలోచన చేయాలి కదా. అవినీతి లేని,పారదర్శకత కలిగిన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పి రెండేళ్లయ్యింది. వైసీపీ నాయకులు ఎక్కడైనా పైసా అవినీతి చేశారని చెప్పే దమ్ము ప్రతిపక్షానికి ఉందా..ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ అని తమ్మినేని తెలిపారు.