NTV Telugu Site icon

కోవిడ్ చికిత్స రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం…

cm jagan

కోవిడ్ చికిత్స రేట్లు పెంచింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కోవిడ్‌ చికిత్సకు ఇప్పుడు ఇస్తున్న రేట్లు పెంచండి అని తెలిపారు.  ప్రభుత్వ జాబితా (ఎంప్యానెల్‌)లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్‌ చికిత్సకు వెంటనే రేట్లు పెంచండి.  అవే రేట్లను కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల (ఎంప్యానెల్‌)కు కూడా వర్తింప చేయండి. ఏ ఆస్పత్రి (ప్రభుత్వ ఎంప్యానెల్‌)లో కూడా కోవిడ్‌ చికిత్సకు నిరాకరించకుండా చూడండి.కోవిడ్‌ ఆస్పత్రులలో పని చేస్తున్న ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓల జీతాలు కూడా పెంచండి. రోగులకు వైద్య సేవల్లో ఎక్కడా ఏ ఇబ్బంది రాకూడదు అని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు.