ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ… ఇప్పటివరకు 437 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేశాం. ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచాలని కేంద్రాన్ని కోరాం. ఏపీకి రెండు ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయి. క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నాము. శ్రీ సిటీలో క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం ఉంది. 30,559 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లు కొత్తవి ప్రారంభిస్తున్నాం అని అన్నారు. 7,749 మంది కోవిడ్ కేర్ సెంటర్లల్లో ఉన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 15 వేలకు చేరొచ్చు. ఆ మేరకు బెడ్ల కొరత తీరే అవకాశం ఉంది. మే నెలలో 9,90,700 కోవీషీల్డ్, 3,43,930 కోవాగ్జీన్ డోసుల కొనుగోళ్లకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.