NTV Telugu Site icon

ఏపీ వాతావరణ సూచన…

ఉత్తర-దక్షిణ ద్రోణి, మరట్వాడా నుండి, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి సముద్ర మట్టం నకు 0.9  కి. మీ. ఎత్తు వద్ద ఉన్న ది. దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాల్లో, సముద్ర మట్టానికి  1.5km ఎత్తులో ఏర్పడిన  ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు,రేపు మరియు ఎల్లుండి, ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు మరియురేపు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు  చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి,  ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. 

రాయలసీమ:

ఈ రోజు  ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు  చోట్ల  తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.