Site icon NTV Telugu

ఏపీ వాతావరణ సూచన…

ఈరోజు, ఉత్తర కోస్తాఆంధ్రాలో  ఉరుములు, మెరుపులు తో పాటు 30km నుండి 40km  వరకు వేగము తో ఈదురు గాలులూ మరియు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  రేపు ఒకటి లేదా రెండు చోట్ల  తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు ఒకటి లేదా రెండు చోట్ల  తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్ర లో  ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే  అవకాశం ఉంది. ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.     

రాయలసీమ:
 
ఈ రోజు రేపు, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2 – 3°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.    

Exit mobile version