NTV Telugu Site icon

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిస్సా తీరము మరియు దాని పరిసర ప్రాంతాలలో 0.9 km ఎత్తు వరకు  ఏర్పడింది. కేరళ తీరప్రాంతానికి దగ్గరలోని ఆగ్నేయ అరేబియా సముద్రము నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km  ఎత్తు వద్ద  ఏర్పడిన ఉపరితల ద్రోణి / విండ్ డిస్కంటిన్యుటి బలహీనపడింది.   

ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో  ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి  ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు, రేపు, ఎల్లుండి  దక్షిణ కోస్తాఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే  అవకాశం ఉంది.
      
రాయలసీమ:

ఈరోజు, రేపు, ఎల్లుండి  రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే  అవకాశం ఉంది.