Site icon NTV Telugu

రతన్‌ టాటాను రాష్ట్రపతి చేయాలి: నాగబాబు

మెగా బ్రదర్‌ నాగబాబు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాను తదుపరి రాష్ట్రపతిని చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసేవాడు కాదు.. దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. ఈమేరకు రాష్ట్రపతిగా రతన్‌టాటా పేరును సూచిస్తూ.. #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్‌ చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే ఏడాది జులై 25తో ముగియనున్నది. అయితే దీనిపై జాతీయ స్థాయిలో అప్పుడే చర్చలు మొదలైయ్యారు. ఇక ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Exit mobile version