NTV Telugu Site icon

ప్రభాస్ ‘డార్లింగ్’కు 11 సంవత్సరాలు…!

11 Years for Prabhas's Darling

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘డార్లింగ్’ మూవీ విడుదలై నేటితో 11 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2010 ఏప్రిల్ 24 విడుదలైన ‘డార్లింగ్’ ఈరోజుతో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎ కరుణకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. హీరో తన తండ్రి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో నందిని అనే తన చిన్ననాటి స్నేహితురాలిని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ ఆమెను ప్రేమలో పడేయడానికి హీరో ఏం చేశాడన్నది సినిమా కథ. సినిమాలో ప్రభాస్, కాజల్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ‘డార్లింగ్’ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తి కావడంతో ట్విట్టర్‌లో #11YearsForDarling అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో ‘డార్లింగ్’ చిత్రానికి సంబంధించిన పిక్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.