Ys Sharmila Son Rajareddy to Marry Priya Atluri Soon: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ మనవరాలు అయిన ప్రియా అట్లూరి అనే యువతి కూడా పై చదువుల నిమిత్తం అమెరికాలో ఉంటున్న క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. అయితే చట్నీస్ ప్రసాద్ అనే ఆయనకు ఒకరే కుమారుడు అని ఆయన ఇంకా కాలేజీలో చదువుతున్నాడని ఆమె చట్నీస్ ప్రసాద్ కుటుంబానికి చెందిన అమ్మాయి కాకపోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారని దానికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పడంతో ఇద్దరూ త్వరలోనే ఒకటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ రాజా రెడ్డికి ప్రియాతో తొలిసారిగా చర్చిలో పరిచయం ఏర్పడినట్లు చెబుతున్నారు. గత 4 ఏళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారని పలు వార్తా కథనాలు పేర్కొంటున్నా అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Lamp : మీ పనులు విజయవంతం కావాలంటే ఇలా దీపాన్ని పెట్టాల్సిందే..!
వచ్చే ఏడాది మేలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైఎస్ రాజారెడ్డి అఫీషియల్ పేరుతో ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి వెల్లడించారు. ఇద్దరు పరస్పరం ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒకటయితే ఇద్దరు పెద్దలు అంగీకరించి పెళ్లి చేయడానికి నిర్ణయించడం మరో విశేషం అని అంటున్నారు నెటిజన్లు. ఇక ఇద్దరి సామజిక వర్గాలు వేరు అయినా ప్రేమించుకోవడంతో పెద్దలు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఇక వైఎస్ షర్మిల కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. నిజానికి షర్మిలకు ముందుగా మేనమామ చంద్ర ప్రతాప్ రెడ్డితో వివాహం జరిగింది. ఆయా తరువాత షర్మిలకు బ్రదర్ అనిల్ తో ద్వితీయ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.