Yash 19 : యష్ 19 నుంచి అప్డేట్ వచ్చేసిందోచ్..టైటిల్ అనౌన్స్ అప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో యష్ గురించి అందరికీ సుపరీచితమే.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను అందుకున్న కెజీఎఫ్ సినిమాలో హీరోగా నటించారు.. ఈ రెండు పార్ట్ లు సక్సెస్ ను అందుకున్నాయి.. కేజీఎఫ్ 2 తరువాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది.. సినిమా వచ్చి సంవత్సరం పైనే అవుతున్నా యష్ మాత్రం ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. అదిగో యష్ 19 అప్డేట్, ఇదిగో అప్డేట్ అంటూ పలు వార్తలు ఊరించినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు..
దాంతో రాఖీ భాయ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఎప్పుడంటూ కొంత కాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీనికి యశ్ కూడా మధ్యలో ఓ సారి బదులిస్తూ.. ‘ఎదురు చూస్తూ ఉండండి. క్రేజీ అప్డేట్ ఇస్తాను’ అని చెప్పాడు. ఇటీవల మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ యశ్ 19 సినిమాని డైరెక్ట్ చేయబోతోందని వార్తలు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని, యష్ 19 నుంచి అప్డేట్ రెడీ అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
యష్ అధికారికంగా తన సోషల్ మీడియాలో యశ్ 19 అప్డేట్ ఇచ్చాడు. KVN ప్రొడక్షన్స్ నిర్మాణంలో యష్ తన 19వ సినిమాని ప్రకటించాడు. యశ్ 19 టైటిల్ ని మాత్రం డిసెంబర్ 8 ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ప్రకటించనున్నట్టు అప్డేట్ ఇచ్చారు. అప్పుడే సినిమా డైరెక్టర్ ని కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దీంతో యష్ అభిమానులు ఈ సినిమా ప్రకటన కోసం, అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సారి యశ్ ఏ జోనర్ లో వచ్చి, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి..
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..