ఆస్ట్రేలియాలో ఓ కంపెనీ తోటమాలి ఉద్యోగానికి ధరఖాస్తులు కోరింది. ఆ ఉద్యోగం కోసం ఓ మహిళ ధరఖాస్తు చేసుకున్నది. తోటమాలి ఉద్యోగానికి బాడీబిల్డర్ కావాలని, సున్నితమైన మగువలు ఆ పని చేయలేరని, మీరు ఈ ఉద్యోగానికి అనర్హులని కంపెనీ సమాధానం ఇచ్చింది. ఈ ఉద్యోగానికి ఆర్హులని మీరు భావిస్తే ఫలానా నెంబర్ కు కాల్ చేయమని కంపెనీ నుంచి సమాధానం వచ్చింది. దీనిపై సదరు మహిళ ఘాటుగా రిప్లై ఇచ్చింది. తనకు వ్యవసాయ పనుల్లో అనుభవం ఉందని, 40 డిగ్రీల ఎండలో వ్యవసాయ పనులు చేసినట్టు మహిళ రిప్లైలో పేర్కొన్నది. మీ కంపెనీకి సంబందించిన పూర్తి వివరాలు తెలసుకున్నానని, తనకు మంచి అవకాశమని భావించానని, కాని మీ సమాధానం బట్టి తన శ్రమకు తగిన ఉద్యోగం కాదని, చులకనభావంతో మాట్లాడేవారి వద్ద పనిచేయకపోవడం ఉత్తమం అని ఆ మహిళ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మంచి రిప్లై ఇచ్చారని మహిళను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
అలాంటి వ్యక్తులే తోటమాలి ఉద్యోగానికి అర్హులు… అదిరిపోయే రిప్లై ఇచ్చిన మహిళ…
