Site icon NTV Telugu

నయన్ చేతిలో బేబీ… సస్పెన్స్ లో అభిమానులు

Who is the baby with Nayanthara

లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవలే ప్రైవేట్ వేడుకలో తన ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుగా ప్రకటించి వార్తల్లో నిలిచింది. తాజాగా మరోమారు ఆమె ఓ బేబీని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ కలిసి ఉండగా, నయన్ బేబీని ఎత్తుకుంది. దాంతో అసలు ఆ బేబి ఎవరు అనే ప్రశ్న అభిమానులను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఆమె అభిమానులు ఈ బేబీ ఎవరై ఉంటారబ్బా !? అనే ఆలోచనలో పడిపోయారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రంలో ఆ బేబీ చిన్నారి పాత్ర పోషిస్తుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు.

Read Also : తగ్గేదే లే… “పుష్ప” అప్డేట్ అదిరిపోయింది

నటి నయనతార శరత్‌కుమార్ నటించిన ‘అయ్యా’ చిత్రంతో తమిళ సినీరంగ ప్రవేశం చేసింది. ఆమె తదుపరి చిత్రంలో సూపర్ స్టార్ రజనీతో జతకట్టి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా హవా కొనసాగిస్తూనే యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో గత ఆరు సంవత్సరాలుగా ప్రేమాయణం నడిపిస్తోంది. ఈ జంట పెళ్ళి గురించి నయన్ అభిమానులతో పాటు సౌత్ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version