కరోనా మహమ్మారి వర్కింగ్ స్టైల్‌నే మార్చేసింది… ఆఫీసుకు వెళ్లే పనిచేయాలనే నిబంధనకు మంగళం పాడేసి.. ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే చేసింది.. ఇక పిల్లలు స్కూల్‌కు వెళ్లే అవకాశమే లేకుంటా చేసి.. ఆన్‌లైన్‌లో ఆపసోపాలు పడేలా చేసింది. మరోవైపు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా.. పెళ్లి, పేరంటాలు ఉన్నా.. వర్క్ ఫ్రమ్ హోం తప్పనిసరి.. అయితే, తాజాగా ఓ పెళ్లి కుమారుడు.. అది కూడా పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్‌తో దర్శనమిచ్చి ఔరా! అనిపించాడు… దీంతో.. ఆ విడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది.
అయితే, ఆ వీడియోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటింజన్లు.. పెళ్లి తంతు పక్కనపెట్టుకుని అర్జంట్ మీటింగ్ అంటూ ల్యాప్‌టాప్‌తో పెళ్లి కుమారుడు కుస్తీ పడుతున్నారని కొందరు.. ఇక, ల్యాప్‌టాప్‌తో పనిచేసుకుంటున్న పెండ్లికొడుకు ఓవైపు బిజీగా ఉంటే.. మరోవైపు కొంచెం దూరంగా పెళ్లి కూతురు నవ్వుతూ సోఫాలో కూర్చున్న దృశ్యాలు ఆ వీడియోలు కనిపిస్తున్నాయి.. దుల్హానియా అనే పేజ్ ఇన్‌స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. వెల్‌కం టూ వెడ్డింగ్స్ 21 అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో.. తక్కువ సమయంలోనే ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది..