Site icon NTV Telugu

Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

Crow

Crow

ప్రకృతిలో అనేక జంతువులు, పక్షులు చేసే పనులు చాలా సార్లు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక కాకి దాని అద్భుతమైన తెలివితేటలతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వైరల్ వీడియోలో ఆ పక్షి కష్టపడి పనిచేయడం కంటే.. తెలివితేటలను ఎలా ఉపయోగించాలో నిరూపించింది. అది అనుసరించిన పద్ధతి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.

READ MORE: Gujarat High Court: టాయిలెట్‌లో కూర్చుని వర్చువల్ విచారణకు హాజరైన యువకుడు.. వీడియో వైరల్

వైరల్ వీడియో ప్రారంభంలో కాకి మొదట ఇటుక సహాయంతో వాల్‌నట్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించడాన్ని చూడవచ్చు. అయితే, అది తన ప్రయత్నంలో విఫలమైంది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంది. కాకి నిరుత్సాహపడకుండా.. వాల్‌నట్‌తో రోడ్డుపైకి చేరుకుంది. రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనాల టైర్ల కింద వాల్‌నట్స్‌ను పెట్టింది. ఓ కారు దాని పై నుంచి వెళ్తుంది. దీంతో ఆ వాల్‌నట్స్ ముక్కులగా మారింది. ఆ కాకి ఆనందంగా దాన్ని తీసుకుని తిని ఎగిరిపోతుంది.

READ MORE: Zohran Mamdani: మోడీ, నెతన్యాహూ ఒకటే.. గుజరాత్ ముస్లింల గురించి మమ్దానీ అడ్డగోలు అబద్ధాలు..

ఈ వీడియో చూసిన తర్వాత కాకి తెలివికి తప్పకుండా అందరు మంత్రముగ్దులవుతున్నారు. కాకులు నిజంగా చాలా తెలివైనవని ఈ వీడియో మరోసారి రుజువు చేసింది. బాల్యంలో వాటి తెలివితేటల గురించి కొన్ని కథలు విన్నం.. ఇప్పుడు కళ్లారా చూశాక నమ్మక తప్పదు. వాస్తవానికి.. కాకికి చెందిన ఈ ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో కనిపించింది. ఇప్పటికే వేల సంఖ్యలో లైక్‌లు, వ్యూస్ వచ్చాయి.

Exit mobile version