ఆ ఎద్దు కోసం కదలివచ్చిన గ్రామం… ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషులకు మనుషులు సహాయం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరి స్వార్ధం వారిది. ఒక మనిషి బతికున్న సమయంలోనే ఆదుకోనివారు మరణించిన తరువాత వస్తారా చెప్పండి. మనుషులకే దిక్కులేప్పుడు ఇక పశువులు మరణిస్తే వస్తారా… ఎవరి బిజీ వారిది. అయితే, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఓ ఎద్దు మరణిస్తే ఆ గ్రామం మొత్తం కదిలి వచ్చింది. ఒక మహా మనిషి మరణిస్తే ఎలాగైతే పుణ్యకార్యాలు నిర్వహిస్తారో ఆవిధంగానే ఆ ఎద్దుకు చేయాల్సిన పుణ్యకార్యాలు అన్ని నిర్వహించారు. ఖననం చేశారు. ఆ తరువాత గ్రామంలోని 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. చనిపోయి ఆ ఎద్దుకు ఎందుకని అంత వైభోగంగా పుణ్యకార్యాలు నిర్వహించారు అనే సందేహం రావొచ్చు. ఎందుకో తెలుసుకుందాం. శహరాన్‌పూర్‌లోని కుర్దీ అనే గ్రామంతో ఆ ఎద్దు 20 ఏళ్లుగా ఉంటోంది. గ్రామంలో ఎవర్నీ ఎమీ అనేది కాదు. చిన్నపిల్లలు కూడా ఆ ఎద్దుతో సరదాగా ఆడుకునేవారు. అందరితో కలిసిమెలిసి వారిలో ఒకటిగా జీవించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగాని ఆ గ్రామంలోని ఓ పవిత్రమైన ప్రాంతంలో సడెన్ గా ఒకరోజు ఆ ఎద్దు కనిపించిందట. అప్పటి నుంచి ఆ గ్రామంలోనే ఉండిపోయింది. దానిని శివుని వాహనమైన నంధీశ్వరుడి అవతారంగా భావించి గ్రామంలోని ప్రజలు దానికి పూజలు చేసేవారు. ఎవరు ఏం చేసినా ఏమీ అనేది కాదట. అందుకే ఆ ఎద్దు అంటే ఆ గ్రామంలోని వారికి అంతటి మమకారం. సడెన్‌గా చనిపోయిన ఎద్దు పుణ్యకార్యాల కోసం గ్రామంలోని ప్రజలంతా చందాలు వేసుకొని పుణ్యకార్యాలు నిర్వహించారు.
Read: ఢిల్లీ-అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్… గంటకు…
Also Read
- Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. 'మునక్కాయ పచ్చడి' చేసేయండి ఇలా.!
- Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
- Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
- Tags
తాజావార్తలు
-
Windfall Tax: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు.. ఎవరికి లాభం?
-
Sajjala Ramakrishna Reddy: టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్!
-
Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..