NTV Telugu Site icon

Vijay Deverakonda : మృణాల్‌తో విజయ్ దేవరకొండ దీపావళి సెలెబ్రేషన్స్ ను చూశారా?

Vd12

Vd12

దీపావళికి పండుగకి సినిమాల నుంచి అప్డేట్స్ వస్తుంటాయి.. ఈ దీపావళికి కూడా అదిరిపోయే అప్డేట్స్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఇక ఈ దీపావళికి మృణాల్, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’సినిమా నుంచి కూడా దీపావళి సర్ ప్రైజ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. సంక్రాంతికి విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి హ్యాపీ దివాళీ అంటూ ఒక ఫోటో షేర్ చేశారు. ఆ పిక్ లో విజయ్, మృణాల్ తో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటూ కనిపించారు. ఈ ఫోటో ఫ్యామిలీ స్టార్ సినిమాలోనే స్టిల్.. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ పోస్టర్ విజయ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ఇక గోపి సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. విజయ్ తండ్రి, భర్తగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి..

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ కూడా చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమాకంటే ముందుగా ఈ సినిమానే ప్రకటించారు. కానీ ఈ VD12ని పక్కన పెట్టి విజయ్ ఫ్యామిలీ స్టార్ సంగతి చూస్తున్నారు. దీంతో గౌతమ్ తిన్ననూరి కూడా ఈ సినిమాని పక్కన పెట్టి ఒక చిన్న హీరోతో ఒక సినిమా మొదలుపెట్టారని వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ఈ సినిమా త్వరగా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం..

Show comments