Site icon NTV Telugu

దేశంలో విచిత్ర‌మైన రైల్వేస్టేష‌న్లు… ఆ స్టేషన్లోకి అడుగుపెట్టాలంటే…

దేశంలో ఎన్నో వంద‌ల రైల్వే స్టేష‌న్లు ఉన్నాయి. అందులో కొన్ని స్టేష‌న్లు యూనిక్‌గా ఆక‌ట్టుకునే విధంగా ఉంటే, మ‌రికొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మ‌న‌దేశంలో కూడా కొన్ని విచిత్ర‌మైన రైల్వేస్టేష‌న్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో రాజ‌స్తాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఒక‌టి. ఈ రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో భ‌వానీ మండి అనే రైల్వేష్టేష‌న్ ఉన్న‌ది. ఈ స్టేష‌న్‌లో రైలు వ‌చ్చి ఆగితే రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో, బోగీలు మ‌రో రాష్ట్రంలో ఉంటాయి. అంతేకాదు, టికెట్ తీసుకునే ప్ర‌యాణికులు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నిల‌బ‌డితే, టికెట్ ఆఫీస్ రాజ‌స్థాన్‌లో ఉంటుంది.

Read: ప్ర‌ధాని హైద‌రాబాద్ టూర్‌పై సీఎస్ కీల‌క స‌మీక్ష‌…

ఇక పంజాబ్‌లోని అట్టారి అనే రైల్వేస్టేష‌న్ ఉన్న‌ది. ఈ అట్టారీ స్టేష‌న్‌లోకి అడుగుపెట్టాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా పాస్‌పోర్ట్ ఉండాలి. పాస్‌పోర్ట్ లేకుండా ఈ స్టేష‌న్‌లోకి అడుగుపెట్ట‌డం నేరం. ప‌ట్టుబ‌డితే భారీ జ‌రిమానా విధిస్తారు. ఇక మ‌హారాష్ట్ర గుజ‌రాత్ స‌రిహ‌ద్దుల్లో న‌వపూర్ అనే రైల్వేస్టేష‌న్ ఉంది. ఈ రైల్వేస్టేష‌న్‌లోని బెంచి మ‌ధ్య‌గుండా రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దు ఉంటుంది. బెంచికి ఒక‌ప‌క్క మ‌హారాష్ట్ర ఉంటే, మ‌రోప‌క్క గుజ‌రాత్ ఉంటుంది. ఈ రైల్వేస్టేష‌న్‌లో టికెట్ కౌంట‌ర్ మ‌హారాష్ట్ర‌లో ఉంటే, ప్ర‌యాణికుల వెయిటింగ్‌రూమ్‌లు, రైల్వే అధికారుల గ‌దులు గుజ‌రాత్‌లో ఉంటాయి.

Exit mobile version