యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ప్రఖ్యాత భవనాలపై భారత త్రివర్ణ పతాకం మెరిసింది. ఇండియాలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశానికి సంఘీభావంగా యూఏఈలోని పలు ప్రసిద్ధ భవనాలపై ఆదివారం భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని అడ్నోక్ ప్రధాన కార్యాలయాలు భారత జెండాతో వెలిగిపోయాయి. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ అక్కడ ప్రదర్శించిన భారత త్రివర్ణ పతాకం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇండియా ఇన్ యూఏఈ’ తన ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. కోవిడ్ 19కి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇండియాకు దుబాయ్‌లోని అత్యంత్య ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై మన జాతీయ జండాను ప్రదర్శించి యూఏఈ తన సపోర్ట్ ను తెలియజేసింది. కాగా ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ గరిష్ట కేసులు నమోదు చేసిన మొదటి ఐదు రాష్ట్రాలుగా నిలిచాయి. భారతదేశంలో కోవిడ్-19 సంక్షోభం తీవ్రతరం కావడంతో యుకె, యుఎస్, కెనడా తమ సహాయాన్ని ప్రకటించాయి.
‘స్టే స్ట్రాంగ్ ఇండియా’… బుర్జ్ ఖలీఫాపై భారతీయ జెండా…!
