రాజస్థాన్‌లో ఓ అద్భుతం జరిగింది. రెండుతలలో ఓ వింత గేదే జన్మించింది. రెండు తలల, నాలుగు కాళ్లు ఉన్న ఇలాంటి గేదెలు సాధారణంగా పుట్టిన కాసేపటికి మరణిస్తుంటాయి. కానీ, ఈ గేదె మాత్రం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు పశువైద్యులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యంతో ఉండటంతో పాటుగా ఆహారం రెండు తలలకు ఉన్న నోటి నుంచి తీసుకుంటుందని దాని యజమానులు చెబుతున్నారు. రెండు తలలతో జన్మించిన గేదె పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆహారం కూడా తీసుకుంటూ ఉండటంతో దానిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలోని శిక్రౌడా గ్రామంలో జరిగింది. ఆగస్టు 30 వ తేదీన ఈ గేదె జన్మించినట్టు దూడ యజమానులు చెబుతున్నారు.
Read: ఒకవైపు కరోనా… మరోవైపు భారీ వర్షాలు… ఆ నగరంలో ఎమర్జెన్సీ…
