ఒక‌వైపు క‌రోనా… మ‌రోవైపు భారీ వర్షాలు… ఆ నగరంలో ఎమ‌ర్జెన్సీ…

అమెరికాలో క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టుగానే త‌గ్గి తిరిగి భారీ సంఖ్య‌లో పెరుగుతున్నాయి. ప్ర‌తిరోజూ ఆ దేశంలో ల‌క్ష వ‌ర‌కు కేసులు న‌మోద‌వుతున్నాయి.  డెల్టా వేరియంట్ వేగంగా విస్త‌రిస్తోంది.  ఒక‌వైపు క‌రోనా కేసులతో అతలాకుత‌లం అవుతుంటే, ఇప్పుడు భారీ వ‌ర్షాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి.  హ‌రికేన్ ఇదా దెబ్బ‌కు దేశం విల‌విల‌లాడిపోతున్న‌ది.  న్యూయార్క్‌లో ఎప్ప‌డూ లేని విధంగా భారీ వ‌ర్షం కురిసింది.  దీంతో రోడ్ల‌పై ప్ర‌మాద‌క‌ర‌మైన స్థాయిలో వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తోంది.  రోడ్ల‌న్ని సెల‌యేరులా మారిపోవ‌డంతో ఎమ‌ర్జెన్నీని విధించారు.  ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పించి బ‌య‌ట‌కు రావొద్ద‌ని, ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.  న్యూయార్క్‌లోని సెంట్ర‌ల్ పార్క్‌లో ఒక గంట వ్య‌వ‌ధిలోనే ఏకంగా 8 సెంటీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది.  ఈ స్థాయిలో దీంతో పార్క్‌లోకి ఎవ‌ర్నీ అనుమ‌తించ‌డం లేదు.  మ‌రోవైపు న్యూజెర్సీ లో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  వ‌ర్షాల‌తో పాటుగా టోర్న‌డోలు కూడా విరుచుకుప‌డుతుండ‌టంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.   

Read: ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతారా… అధిష్టానం మనసులో ఏముంది?

Related Articles

Latest Articles

-Advertisement-