ప్రతినిత్యం సోషల్ మీడియాలో వందల సంఖ్యలో వీడియోలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతూ ఉండడం మనం చూసే ఉంటాము. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిత్ర విచిత్ర పనులు చేస్తూ చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేయడంలో చాలామంది దెబ్బలు తినగా.. మరికొందరు ఏకంగా ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇక ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘటన సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంస్టాగ్రామ్ రీల్స్ కోసం ఇద్దరమ్మాయిలు చేసిన స్టంట్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Kalki 2898 AD: అందరి కళ్ళు కల్కి మీదే.. ఇదెక్కడి క్రేజ్ మావా?
వైరల్ గా మారిన వీడియోలో గమనించినట్లయితే.. ఇద్దరు పాఠశాల చదువుకునే అమ్మాయిలు గాలిలో స్టంట్ చేయాలనుకున్నారు. అయితే అందులో ఓ అమ్మాయి టాస్క్ సరిగా చేయకపోవడంతో రోడ్డుపై అలాగే కింద పడిపోయింది. దాంతో ఆ అమ్మాయికి నడుము విరిగినంత పని అయింది. ఈ వీడియోలో గమనించినట్లయితే ఓ అమ్మాయి మరో అమ్మాయి చేతులు పట్టుకొని అమ్మాయి భుజాల పైకి ఎక్కి అమాంతం పైకి ఎగిరి కిందికి చేరేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్లాన్ కాస్త రివర్స్ అయింది.
Damodar Raja Narasimha: జూడాలతో మంత్రి చర్చలు అసంపూర్ణం.. కొనసాగుతున్న సమ్మె
అమ్మాయి పైకి ఎగిరి కింద పడుతుండగా సరిగా బ్యాలెన్స్ కాకపోవడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. బాడీను బ్యాలెన్స్ చేయలేక నడుము గట్టిగా రోడ్డుకు తగిలింది. ఈ దెబ్బతో ఆ అమ్మాయి నొప్పితో ఇబ్బంది పడింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో నడుం విరిగిపోయిందని అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో అనేకమంది నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదువుకోమని పాఠశాలకు వెళ్ళమంటే.. మీరు రోడ్లపై ఇలాంటి పనులు చేయడమేంటి అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తుంటే.. మరికొందరైతే ఇలాంటివి చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను ఒకసారి చూసేయండి.