NTV Telugu Site icon

Tomato Price: పెరుగుతున్న టమోటా ధరలు.. కొద్దిరోజుల్లో రూ. 400?

price hike

price hike

దేశంలో ఒకవైపు భారీ వర్షాలు.. మరోవైపు భగ్గుమంటున్నా కూరగాయల ధరలతో జనాలు బేంబెలెత్తిపోతున్నారు.. ముఖ్యంగా టమాటా ధర తగ్గుముఖం పడుతుందేమో అని ఆశతో ఎదురుచూస్తున్న వినియోగ దారులకు షాక్ ఇస్తూ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. సామాన్య ప్రజలకు టమోటా అందని ద్రాక్షల మారుతుంది.. టమోటా కూర అనే పదాన్ని కూడా తియ్యడం లేదు.. ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో రానున్న రోజుల్లో టమాటా ధర మండిపోనుంది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలకు హిమాచల్ నుంచి టమాటా సరఫరా అయ్యేది.

అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ నుంచి టమాటా సరఫరా తక్కువగా ఉండడంతో టమాటా ధరలు రూ.400 దాటే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని మార్కెట్‌ వ్యాపారులు చెబుతున్నారు.. ఆగస్టు 2 న, ఢిల్లీలో టమోటా హోల్ సెల్ లో కిలో రూ. 203 ఉండగా.. రిటైల్ గా కిలో ధర రూ. 250కి చేరుకుంది. మదర్స్ డైరీ అవుట్లెట్. మరోవైపు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కిలో రూ.263కి చేరుకొని దేశంలోనే అత్యంత ఖరీదైన టమోటాగా రికార్డ్ సృష్టించింది..

నెల రోజులుగా కిలో 300 రూపాయలు దాటేలా కనిపిస్తుంది.. మరో నెల రోజుల్లోనే కిలో టమోటా రూ.400 దాటేలా కనిపిస్తుంది.. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయని తెలుస్తుంది.. ముఖ్యంగా అధిక వర్షాలు.ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్ హోల్‌సేల్ వ్యాపారి సంజయ్ భగత్ సమాచారం ఇస్తూ తెలిపారు. వ్యవసాయదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టమాటా ధర కిలో రూ.400కి చేరుతుంది. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా, ఇతర కూరగాయల్లో నాణ్యత తగ్గిపోయిందన్నారు.. ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఇలానే కొనసాగితే 500 పలికిన ఆశ్చర్య పొనవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు..

Show comments