నేడు అంతర్జాతీయ పితృ దినోత్సవం. ప్రతి ఏడాది జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని ప్రపంచదేశాలు ‘ఫాదర్స్ డే’గా జరుపుకుంటుంటారు. అలాగే ఈ ఏడాది కూడా బాధ్యతకు మారు పేరుగా నిలిచే తండ్రుల గౌరవార్థంగా “ఫాదర్స్ డే”ను జరుపుకుంటున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, వారి పిల్లలు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు స్పెషల్ గా స్టార్ హీరోలు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : “మాస్ట్రో” షూటింగ్ పూర్తి
“మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు” అంటూ మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి ఫోటోను షేర్ చేశారు. అలాగే మహేష్ బాబు, శృతి హాసన్, థమన్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, మంచు లక్ష్మీ వంటి ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా “ఫాదర్స్ డే” విషెష్ తెలియజేశారు.
A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
