కొన్ని కొన్ని వీడియోలు ఎలా వైరల్ అవుతాయో తెలియదు. వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. పుషప్స్ అనేవి ఎక్సర్‌సైజ్‌లో ఒకభాగం. అవి చేసే ముందు ట్రాక్ సూట్ వేసుకొని చేస్తుంటారు. అయితే, ఓ కొత్త పెళ్లికూతురు లెహంగా వేసుకొని పుషప్స్ చేసింది. వివాహం సమయంలో ఎనర్జిటిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అలా చేసినట్టు తెలుస్తోంది. లెహంగాలో కొత్త పెళ్లి కూతురు చేసిన పుషప్స్ కి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈమె ఫిట్నెస్ ఔత్సాహికురాలు నోరా అరోరా. రెగ్యులర్‌గా జిమ్ కు సంబందించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 81 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా, తన వివాహం సందర్బంగా ఇలా లెహంగాలో పుషప్స్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో వైరల్ అవుతున్నది.
వైరల్: ఇలా కూడా పుషప్స్ చేయవచ్చట…!!
